చాలా మంది నిమ్మరసం రోజూ తాగుతుంటారు. బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా నిమ్మరసం కాపాడుతుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అధిక బరువు తగ్గిస్తుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే నిమ్మరసం బాగుంది కదా అని ఎక్కువగా తాగితే సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే అని అంటున్నారు. నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే 7 రకాల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
నిమ్మ రసాన్ని నీటిలో కలిపి తాగినా ఎక్కువగా తాగితే దంతాలు దెబ్బతింటాయి. లెమన్ వాటర్‌లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలపై ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతుంటాయి. నాలికతో దంతాల్ని టచ్ చేసినప్పుడు గరుకుగా అవుతున్నట్లు అనిపిస్తాయి. అలా అనిపిస్తుంటే నిమ్మరసం ఎఫెక్ట్ పడినట్లే. దంతాలపై ఎఫెక్ట్ పడకూడదనుకుంటే నిమ్మరసాన్ని స్ట్రాతో తాగడం మంచిది. నిమ్మరసం ఎక్కువైతే అల్సర్లు, అసిడిటీ సమస్యలు, కడుపునొప్పి వస్తాయి. పొట్టలో వేడి, వికారం, వామ్టింగ్స్ వస్తున్నట్లు అవుతుంది. నిమ్మరసం అంటే మనకే కాదు సూక్ష్మ జీవులకు కూడా ఇష్టమే. 21 రెస్టారెంట్లలో వాడుతున్న నిమ్మకాయల్ని టెస్ట్ చెయ్యగా 70 శాతం నిమ్మకాయలపై ఇ-కోలి లాంటి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ వల్ల వామ్టింగ్స్, డయేరియా వంటివి వస్తున్నట్లు తేలింది. అందువల్ల నిమ్మకాయ ముక్కల్ని నీటిలో వేసి ఆ నీటిని తాగడం కంటే నిమ్మకాయ రసాన్ని మాత్రమే నీటిలో వేసి ఆ నీటిని తాగడం మంచిది.
Also Read : పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...
నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే మూత్రాశయం అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల దానిపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మూత్రాశయ వ్యాధులు వస్తాయి. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగితే చిగుళ్లు పాడైపోతాయి. చాలా మంది నిమ్మరసం, షుగర్ కలుపుకొని తాగుతారు. ఆ షుగర్ అణువుల్ని చిగుళ్లపై ఉండే బ్యాక్టీరియా తింటుంది. అది అక్కడే కాలనీలు నిర్మించుకొని యాసిడ్లు రిలీజ్ చేస్తుంది. ఫలితంగా చిగుళ్లు దెబ్బతింటాయి. నిమ్మరసం మన నాలికకు ప్రమాదకరం. ఓ వారం పాటూ రెగ్యులర్‌గా నిమ్మరసం తాగుతూ పోతే నాలిక మండుతుంది. అక్కడక్కడా పగుళ్లు వస్తాయి. అసౌకర్యంగా అనిపిస్తుంది. సరిగా మాట్లాడలేరు. ఈ పగుళ్ల సమస్యలు ఓ వారం పాటూ ఉండి వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమందికి నిమ్మరసం తాగితే తలనొప్పి వస్తుంటుంది. అలాంటి వారు దానికి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువ నిమ్మరసం తాగితే అది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
Famous Posts:
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
> కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
> కరోనా పాజిటివ్ వ్యక్తులకు అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
lemon juice recipe, lemon juice benefits, how to make lemon juice, lemon juice benefits for skin, drinking pure lemon juice, lemon juice for digestion, lemon juice nutrition, how to make lemon water, నిమ్మరసం