అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం..
చక్కని పరిష్కారం..!!
ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా?
అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం అంటే..కొబ్బరి నూనెతో విఘ్నేశ్వరుడికి
ఒక్కొక్క కుందె లో 3 ఒత్తులు వేసి రెండు దీపాలు పెట్టాలి. ఇలా కేవలం బుధవారమే కాకుండా రోజు
ప్రతి రోజూ దీపం పెట్టాలి.
గూడోపహారం అంటే బెల్లం నివేదన చేయాలి.
అష్టోత్రం.. ఎర్రటి అక్షింతలుతో కానీ..
ఎర్రటి పూలతో కానీ చేయాలి.
గరికతో కూడా చేయవచ్చు.
అష్టోత్రం చేయలేనివారు..ఓం శ్రీ వినాయకాయ నమః. అనీ 108 సార్లు పఠించాలి.
ఇలా పెట్టడం ద్వారా విఘ్నేశ్వరుడు మనకి వచ్చిన ఆటంకాలు మరియు విఘ్నాలు తొలగిస్తాడు.
గణపతికి ఎన్నో రూపాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము.
అయితే దానిలో విఘ్నరాజాధీపతి అయిన వినాయక రూపం అయితే మళ్ళి ఆ విఘ్నాలు కలిగించి తొలగించేది కూడా వినాయకుడే
అందుకే మన పనిలో ఆటంకాలు పోవడానికి
“ఓం శ్రీ వినాయకాయ నమో నమః” అనీ తలుస్తూ ఉండాలి.
విఘ్నేశ్వరుడికి ఎర్రని పువ్వులు అంటే ఎంతో ప్రీతికరమైనవి.
వినాయకుడికి చాలా ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ, గరికతో గణపతి స్తోత్రం చదివి నైవేద్యంగా బెల్లం పెట్టాలి.
మంగళవారం పూట దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మంగళవారం రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి దీపమెలిగించే మహిళలు నిష్ఠతో అమ్మవారిని దుర్గాష్టకంతో స్తుతిస్తే ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇంకా మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానమాచరించి.. ఇంటిని, పూజామందిరమును శుభ్రం చేసుకుని పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 వరకు ఆలయాల్లో జరిగే రాహుకాల పూజను ముగించుకోవాలి. అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గృహంలో దీపమెలిగించి.. పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దీపమెలిగించే సమయంలో దుర్గా స్తోత్రాన్ని 9 తొమ్మిదిసార్లు పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకొని ఆ పాదాన్ని ముందుగా బయటపెట్టి బయటు దేరితే కార్యజయం కలుగుతుంది.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా మందికి దుశ్శకునాల భయం ఉంటుంది. అలాంటి వారు దేవుడికి పూజ చేసిన పువ్వులను జేబులో లేదా బ్యాగులో దగ్గర ఉంచుకుని బయటకు వెళితే దుశ్శకునాలు బాధించవు.
దంపతుల మధ్య కలహాలు నివారణ కావాలంటే రాత్రి పడుకోబోయే ముందు భర్త తలదగ్గర కర్పూరం ఉంచి, భార్య తల దగ్గర సింధూరాన్ని చిన్న పోట్లంలో ఉంచుకోవాలి. నిద్రలేచాక కర్పూరాన్ని వెలిగించి, సింధూరాన్ని ఇంట్లో చల్లాలి. ఇలా చేయడం ద్వారా చిన్న.. చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
మానవుడు తన జీవితంలో నిత్యం లక్ష్మిరాక కోసం పోరాడుతూనే ఉంటాడు. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్దలతో నిత్యం ఉదయం కాని సాయంత్రం గాని చదివితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికి… సుఖసంతోషాలతో జీవిస్తారు. దీనికి నియమాలు ఏమి పెద్దగా లేవు…శుచిగా శుబ్రంగా ఉంటె చాలు. ఈ శ్లోకం వీడియో ఈ క్రిందన ఇవ్వబడింది…
సహస్రదళ పద్మాస్తాం స్వస్తాంచ సుమనోహరం శాంతాంచ శ్రీహారే కాంతామ్ తాం
భాజేత్ జగతాం ప్రసుమ్
Famous Posts:
> దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
> భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
> ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
గణపతి, simple ganesh puja at home, ganesh puja samagri list in english, ganesh puja samagri online, how to perform ganesh chaturthi puja at home, ganesh pooja kit, ganesh puja vidhi, ganesh puja mantra, ganesh puja samagri list in telugu