పూజగదిలో సాధారణంగా ఇష్టదేవతల ఫోటోలను ఉంచుకోవడం సంప్రదాయం. పూజ కోసం ఏర్పాటు చేసిన గదిలో దేవుడు ఫోటోలతో పాటు ఇంట్లో మృతి చెందిన వారి ఫోటోలను కూడా ఉంచుతారు. దేవుళ్ళతో పాటు వారిని కూడా స్మరిస్తూ.. పూజలు చేస్తుంటారు.
అయితే మరణించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వారిని పూజించడం, స్మరించడం తప్పుకాదు. కానీ దేవుడి దగ్గర చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదట.
ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుంది. అందుకే వాస్తు ప్రకారం పూజగదిలో దివంగతుల ఫోటోలను ఉంచకూడదు. వాస్తు ప్రకారం పూజాగదిలో దివంగతుల ఫోటోలను ఉంచితే ఆ ఇంటికి మంచి జరగదట. ఇంట్లో ఈశాన్య దిశగా పూజాగదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలను ఉంచాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ ఇంట నెగటివ్ శక్తి ప్రభావంతో ఇంట్లో ఉన్నవారికి మానసిక ప్రశాంతత ఉండదు.
చనిపోయిన వారి ఫోటోలను దేవుళ్లకు సమానంగా.. దేవతా పటాలకు పక్కనే ఉంచి.. పూజలు చేయడం పెద్ద తప్పిదమే అవుతుంది. మనిషి ఎప్పుడూ దేవుడికి సమానం కాదని.. అందుకే పూజాగదిలో దేవతల ఫోటోలు మాత్రమే ఉంచాలని.. మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదని.. అలా పెడితే మాత్రం కష్టాలు అనుభవించక తప్పదని, మానసిక ప్రశాంతతను కోల్పోతారని వాస్తు నిపుణులు అంటున్నారు.
Famous Posts:
> ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
> దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
> భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
> ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
దేవుని ఫోటోలు, చనిపోయిన వాళ్ల ఫోటోలు పూజ గది, Puja Room, Where To Keep Dead Person Photos In House,pooja room vastu, dharma sandehalu, sanatana dharmam.