కూతురా ? కోడలా ?? ఎవరు ప్రధానం ?
కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది....కోడలి గొప్పతనం...
కూతురా కోడలా ఎవరు ప్రధానం...??అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...—ఎందుకోతెలుసా...!!
చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!
కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!
తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!
తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!
కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!
కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!
ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...??
కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి..... అందులో మీరు, నేను కూడా ఉండాలి...
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శనేశ్వరుడు శనివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> శివదేవుని సోమవారపు నోము కథ
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
dharma sandehalu, dharma sandehalu telugu lo, sutakam dharma sandehalu, daughter and daughter in law, devotional story's.
Tags
interesting facts
This comment has been removed by the author.
ReplyDelete