దక్షిణాయనం అంటే ఏమిటి ? ఏమి చెయ్యాలి ? What Is The Meaning Of Dakshinayanam

దక్షిణాయనం అంటే ఏమిటి..? దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?
సనాతన ధర్మంలో అంటే మతం కాదు. ఇది ఒక శాస్త్రీయమైన జీవినవిధానం. దీనిలో మన పూర్వీకులు అనేకానేక శాస్త్రీయ అంశాలను జోడించి నిత్యనూతనంగా మనకు అందించారు.
నేటికి అవి ఆచరనీయాంశాలే కావడం గమనార్హం. జూలై 16 నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఈ విశేషాలు తెలుసుకుందాం...

భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని చెప్తారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు..
సూర్యగమనంలో మార్పు:
దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జూలై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 (సంక్రాంతి) వరకూ కొనసాగుతుంది. ఉత్తరాయణం దేవతలకు ప్రాతినిధ్యం వహించేది కాగా, దక్షిణాయనం పితృదేవతలకు ప్రాతినిధ్యం వహించే కాలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళయ పక్షాలు బాద్రపదమాసంలో వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెప్పేవారూ ఉన్నారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.

సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.  దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.
దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.

సంతానాభివృద్ధికి ఏం చేయాలి..? 
ఎలా చూసిన దక్షిణాయణంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.
దానం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి..? 
ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, ఈ కాలంలో పేదవారికి, అన్నార్ధులకు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, నువ్వుల దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, రావి చెట్టుకు ప్రదక్షిణలు, ఆదిత్య హృదయ పారాయణం, సూర్యనమస్కారం, ధ్యానం (యోగ) చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని ఇతిహాసాల ద్వార తెలుస్తుంది.

సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.
ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.
Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


దక్షిణాయనం, దక్షిణాయనం అంటే ఏమిటి..?, ఉత్తరాయణ పుణ్యకాలం, ఆయనములు, దక్షిణాయనం 2020, ఉత్తరాయణం దక్షిణాయనం, dakshinayanam in telugu
uttarayanam in telugu, uttarayanam period 2020 in telugu, uttarayanam dakshinayanam, dakshinayanam meaning in telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS