గుడ్లగూబ మీ ఇంట్లోకి వస్తే మంచి శుభ శకునం | what does it mean when an owl comes to your house

'గుడ్లగూబ'ను చాలామంది అశుభసూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. దానిని చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళల్లో మాత్రమే కనిపించడం... దాని అరుపు వికృతంగా వుండటం..
అది ఇంట్లోకి వస్తే కొంత కాలంపాటు ఆ ఇల్లే వదిలి పెట్టాలని చెప్పుకోవడం... అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది.

ఇలాంటి వారి మాట నమ్మినట్లయితే పప్పులో కాలేసినట్లే అని గమనించండి. శాస్త్రం ప్రకారం గుడ్లగూబ శుభ సూచకం. ఇది లక్ష్మీ దేవి వాహనం. లక్ష్మీదేవి స్వామి వారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడిని, ఒంటరిగా ప్రయాణం చేయవలసినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుంది. ఉల్లూక తంత్రంలో గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది.
రాత్రి నాల్గవ జాములో :
రాత్రి నాల్గవ జాములో గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుందట. గుడ్లగూబ ఇంటి ఆవరణలో గానీ... పశువుల శాలలో గాని, పొలంలోని చెట్లపై గాని నివాసముంటే, ఆ యజమానికి పాడిపంటలకు ... సుఖసంతోషాలకు కొదవ ఉండదట. మరి అలాంటి గుడ్లగూబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉంది.

ప్రశాంతంగా ధైర్య సాహసాలను ప్రదర్శించి ముందడుగు వేస్తే వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనపడదు. అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది. అందుకే అమావాస్య రోజు లక్ష్మీ దేవికి మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం. గుడ్లగూబ లేని ఖండం లేదు. ప్రపంచం అంతటా గుడ్లగూబ జాతి ఉంది. అడవుల్లో ఉండే ఈ పక్షులను ఉపాసన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి.

లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు 
అతి వేగంతో ఆవిడ దర్శనం ఉండదు. అతి వేగంగా ధనం ఎవరికీ లభించదు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.వేట సమయంలో పక్షి తన శరీర బలం కంటే 12 రెట్ల వేగములో ఎలా అయితే ప్రయాణం చేసి ఆహారం సంపాదిస్తుందో అదే మార్గంలో ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవా లంటే వారి వారి శక్తులకు పదింతలు కష్ట పడాలి. అప్పుడే పరిపూ ర్ణ మైన లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. గుడ్లగూబ లేని ఖండం లేదు. ప్రపంచం అంతటా గుడ్ల గూబ జాతి ఉంది. అడవుల్లో ఉండే ఈ పక్షులను ఉపా సన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి.
Famous Posts:






గుడ్లగూబ, లక్ష్మీదేవి, laxmi owl images, laxmi owl pictures, goddess lakshmi vahana owl, owl statue in home is good or bad, uluka owl, lakshmi owl symbolism, alakshmi, owl in hinduism, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS