జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారి కోసం… కొన్ని రాశుల వారికి జీవితాంతం కష్టాలు ఉంటాయి.కొన్ని రాశుల వారికి జీవితాంతం అదృష్టమే ఉంటుంది. మరి కొన్ని రాశుల వారికి కష్టపడే తత్త్వం ఉంటుంది.ఇలా కష్టపడే తత్త్వం ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు.ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుస్కుందాం.
కర్కాటక రాశి:
కర్కాటకరాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు. జల సంబంధిత విషయాఒలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీ పుజ వలన ఆటంకాలను అధిగమించగలరు.
ఈ రాశి వారు అందరితోనూ త్వరగా సులభంగా కలిసిపోతారు.తాము ఎప్పుడు అందరి కన్నా ముందుగా ఉండాలని అసలు ఓటమి అనేది ఉండకూడదని కస్టపడి పనిచేస్తారు.అందువల్ల కర్కాటక రాశి కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భొగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచి పోరు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది.
కర్కాటకరాశి జ్యోతిష విషయాలు:
కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, సంతానము అధికం, శభదం నిశ్శబ్ధం, దిశ ఉత్తరం, ఉదయం పృష్టోదయ రాశి, వర్ణం పాటల వర్ణం (లే గులాబి), జాతి శూద్ర, జీవులు జల జీవులు, కాల పురుషుని అంగములు వక్షస్థలం, తత్వం పూర్ణ జల తత్వం.రస తత్వము కలిగిన బత్తాయి, నిమ్మ, నారంజ, కమలా, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. ఈ రాశి కఫ సంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కారకత్వము వహిస్తుంది.
సింహ రాశి:
ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్ధులుగా పేరు గడీస్తారు. వంశప్రతిష్ఠ, కులగౌరవాలకు ప్రాధానయత ఇస్తారు. ఇతర కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము రాదు. కఠిన మైన స్వభాము కలవారన్న ముద్ర పడుతుండి.
ఈ రాశి వారికి వారి శక్తి సామర్ధ్యాల మీద అపారమైన నమ్మకం ఉండటమే కాకుండా వాటినే నమ్ముకొని ముందుకు సాగుతారు.వీరు నిజాయతీగా ఉంటూ విలువలను పాటిస్తారు. వీరు అంత తేలిగ్గా ఏ విషయంలోనూ రాజీకి రారు.ఈ రాశి వారిని చూస్తే అందరికి గౌరవ భావం కలుగుతుంది.అందుకే వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యొగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచించనంత కాలము మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరనలో పెట్టదము కష్టము అని గుర్తించ వలసి ఉంటుంది. శివార్చన, ఆంజనేయార్చన మేలు చేస్తుంది.
సింహరాశి జ్యోతిష విషయాలు:
సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.
వృశ్చిక రాశి:
వృశ్చికరాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు.
ఈ రాశి వారు ముఖ్యంగా తాము చేయలేని పనులను అంగీకరించి,ఓటమికి తామే కారణమని చెప్పే దైర్యం వీరికి ఉండాలి.ఈ రాశి వారు ఇలా చేస్తే వీరు ఎక్కడైనా మనుగడ సాధించగలరు.ఈ గుణం ఉంటే కనుక వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.ఈ రాశి వారు ఎక్కువగా వారి శక్తినే నమ్ముకుంటారు. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.
వృశ్చికరాశి కొన్ని జ్యోతిష విషయాలు:
రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది. ఈ రాశి రాశ్యధిపతి కుజుడు. ఈ రాశి సమ రాశి, శుభరాశి, స్త్రీరాశి, సరి రాశి, స్త్రీరాశి, స్థిర స్వభావరాశి, జలరాశి, కీటకరాశిగాను వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం, సమయం పగటి సమయం, శబ్దం నిశ్శబ్దం, పరిమాణం దీర్ఘం, జాతి బ్రాహ్మణ, జీవులు కీటకములు, దిక్కు ఉత్తర దిక్కు, పాద జలతత్వం, సంతానం అధికం, ప్రకృతి కఫం, కాలపురుషుని శరీరాంగం మర్మ స్థానం, వర్ణం బంగారు వర్ణం. ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు.
కన్యా రాశి:
కన్యారాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు. ఎ పనుకి ఎవరు సమర్ధులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బధుప్రితి అధికముగా ఉంటుంది. గనితములో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగంచగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు.
ఈ రాశి వారు వారు చేసే పనులపైనే ఎక్కువగా దృష్టి పెట్టటం వలన ఎక్కువగా విజయాలను సాధిస్తారు.వీరు అన్ని విషయాలలోను ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు.అలాగే వారి ప్రయత్నాలు కూడా ఉంటాయి.వీరు చేసే ప్రతి పనిలోను నియమాలను పాటిస్తారు.ఈ లక్షణాల కారణంగా వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. గృహము మీకు నచ్చిన విధముగా తీర్చి దిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలసి వస్తుంది. విష్ణు ఆరాధనా, గణపతి ఆరాధనా వలన సమస్యలను అధిగమించ వచ్చు.
కన్యారాశి జ్యోతిష విషయాలు:
రాశి చక్రంలో కన్యారాశి ఆరవది. ఈ రాశి అధిపతి బుధుడు.ఈ రాశిని స్త్రీ రాశి, శుభరాశి, సమ రాశిగా వ్యవహరిస్తారు. స్వభావం ద్విశ్వభావం, తత్వం భూతత్వం, శభ్ధములు అర్ధ, ఉదయం శీర్షోదయం, జీవులు మనుష్య, నిర్జల తత్వం, పరిమాణం దీర్ఘం, వర్ణములు చిత్రవర్ణం, జాతులు శూద్ర, దిక్కు దక్షిణం, ప్రకృతి వాతం, సంతానం అల్పం, కాలపురుషుని శరీర భాగం ఉదరం.
Famous Books in Telugu:
> నయనార్లు శివభక్తులు | Nayanarlu Shivabhaktulu Telugu PDF Book
తెలుగు జాతకం, రోజువారీ రాశి ఫలాలు, Telugu Jatakam, best horoscope in this rasulu, eenadu astrology today, telugu astrology by date of birth, rasi phalalu 2020, weekly horoscope in telugu, monthly horoscope in telugu, rasi phalalu in telugu 2020
Tags
Horoscope