దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? Secrets Behind the dreams about God | Hindu Temples Guide

దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? పెద్దలు చెప్పే ఆసక్తికర విషయాలు మీకోసం :
సాధారణంగా మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకుని ఆ కష్టాన్ని తొలగించమని వేడుకుంటాము. ఎందుకంటే సర్వము ఆయనకు తెలిసిన సర్వాంతర్యామి గనుక. అయితే భగవంతుడు కలలో కనిపిస్తే అందుకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంది. కొంతమంది ఆ కలను తెల్లారాక మరిచిపోతారు. మరికొంతమంది గుర్తు పెట్టుకుంటారు. ఇంకొందరికి తెల్లారే ముందు కలలు వస్తుంటాయి. ఆ కలలు నిజం కూడా అవుతాయట. ఇలా.. కలల మీద ఒక్కొక్కరికి ఒక్కొక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం కూడా కలల గురించే. అయితే.. కలలో ఎవరెవరో కనిపిస్తుంటారు. ఎవరు కనిపిస్తే ఏమౌతుంది.. అనేదే చాలామందికి తెలియదు.

కొందరికి కలల్లో పాములు కనిపిస్తుంటాయి. మరికొందరికి దయ్యాలు కనిపిస్తుంటాయి. దేవుడు కనిపిస్తుంటాడు. ఇలా రకరకాలుగా వస్తుంటాయి కలలో. అయితే.. అన్నింటి గురించి ఇప్పుడే మనం చర్చించుకోలేం కానీ.. ఒకవేళ కలలో దేవుడు కనిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1. దైవం కలలో కనిపిస్తే చాలా శుభకరమైనది అన్న విషయం మనందరికి తెలిసిందే. మరి మనం సమస్యలలో ఉన్నప్పుడు భగవంతుడు కలలో కనిపిస్తే మనం జరగవనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది.

2. మనం ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు దైవానికి మొక్కులు మొక్కుకుని కష్టం తీరగానే లౌకికి సంబందమైన విషయాలలో పడి అవి మర్చిపోతుంటాము. మీ మొక్కుని గుర్తు చేయడానికి కూడా భగవంతుడు కలలోకి వచ్చాడని అది ఒక సంకేతంగా తీసుకోవచ్చు.

3. మన ఇష్టదైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మనకు, మన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని కరుణ బాగా ఉన్నట్లు. ఒక వేళ మనం కష్టలలో గనుక ఉంటే వాటినుండి త్వరలో బయటపడుతామనే సంకేతంగా తీసుకోవచ్చు.
4. దేవుడు కలలో కనిపిస్తే మనకు చెప్పకనే చెప్తున్నట్లు ఒక సందేశం వచ్చినట్లు. మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతమవుతున్నట్లయితే మీ అంతరంగాన్ని నమ్మండి అని మనకు ఆయన సందేశం ఇచ్చినట్లు. అంటే మన మనసు మనకు ఎలా చెబితే అలా చేయమని అర్దం.

అయితే.. దేవుడు ప్రతిసారి కలలో కనిపిస్తున్నాడంటే ప్రతి సారి ఏదో మంచే జరుగుతుందని భావించకండి. మీరు దేవుడికి ఏదైనా మొక్కు చెల్లించాల్సినప్పుడు.. ఆ మొక్కును గుర్తు చేయడానికి కూడా దేవుడు కలలో కనిపిస్తాడట.
Famous Posts:

పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు

> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

విచిత్ర వినాయక  దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా?

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా

లేపాక్షి ఆలయ రహస్యం మీకు తెలుసా


దేవుడు, దేవుడు కల, dreams, God, The Meaning of Dreams, Secrets Behind the dreams about God, lord venkateswara came in dreams meaning, seeing god statue in dream, god in dreams meaning hindu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS