అంగారక గ్రహంపై ఈ అద్భుతం చూశారా | Latest News About Mars Science Laboratory


ఎర్రటి మట్టిలో తెల్లటి మంచు..చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశానికి వెంటనే వెళ్లాలనే ఆసక్తి కలుగుతోందా.. అయితే అక్కడికి చేరుకోవడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది భూమి మీద కాదు  అంగారక గ్రహంపై. కొరొలెవ్ బిలంగా పిలిచే ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోని కొద్ది రోజుల క్రితం యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) విడుదలచేసింది. అంగారక గ్రహంలోని ఎర్రటి ఉపరితలంపై 82 కి.మీ వెడల్పుతో ఏర్పడిన బిలం మంచుతో కప్పబడి ఉంది. అంగారక గ్రహంపై నార్త్‌ లోల్యాండ్ ప్రాంతంలో ఇది ఏర్పడిందని ఈఎస్‌ఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఈ బిలం పూర్తిగా మంచుతో నిండి ఉందని, ఏడాది మొత్తం దీని మధ్య భాగం 1.8 కి.మీ మేర మందమైన మంచు నీటితో కప్పబడి ఉంటుందని తెలిపింది. ఇలా ఏడాది మొత్తం మంచు నీరు బిలంలో ఉండటానికి కారణం దాని లోతైన భాగం చల్లగా ఉండటం అని ఈఎస్ఏ వెల్లడించింది. మార్స్ ఎక్స్‌ప్రెస్ హై రిజల్యూషన్ స్టీరియో కెమెరా (హెచ్‌ఆర్‌ఎస్‌సీ)తో ఈ వీడియోని తీసినట్లు ఈఎస్‌ఏ వర్గాలు తెలిపాయి. అంగారక గ్రహంపై చాలా రోజులుగా మనుషులు జీవించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుదని శాస్త్రవేత్తలు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రహంపై నీటిని కనగొనేందుకు పలు పరిశోధనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మంచు నీటితో ఏర్పడిన బిలం శాస్త్రవేత్తలు పరిశోధనలకు ఎంతో ఉపయుక్తం కానుందని నిపుణులు భావిస్తున్నారు.
Click here : Video Link
Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

అంగారక గ్రహం, mars planet miracle nasa, live on mars, life on mars, mars rover, signs of life on mars, evidence of life on mars, fossils on mars, bacteria on mars, mars images

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS