ప్రపంచంలో 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఈ ప్రపంచంలో ఉన్నారు. అలా డబ్బు సంపాదించేవారిలో మీరూ చేరాలంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలి. మీ సొంత వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చెయ్యాలి. యూట్యూబ్ చెప్పిన రూల్స్ పాటించాలి. మీకు ఫేస్‌బుక్, ట్విట్టర్, జీమెయిల్ అకౌంట్లు ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక ఆలస్యమెందుకు ఎలా సంపాదించాలో ఏమాత్రం అయోమయం లేకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి... ఫాలో అయిపోండి.
ఇలా చెయ్యండి.
1 ముందుగా గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వండి. మీ జీమెయిల్ అకౌంట్ ఐడీయే గూగుల్ ఐడీ కూడా. అదే యూట్యూబ్ ఐడీ కూడా. ఆ ఐడీ పేరే మీ యూట్యూబ్ ఛానెల్ పేరు కూడా. ప్రస్తుతానికి అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చెయ్యవచ్చు. భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు.
2 యూట్యూబ్‌లో సైన్ ఇన్ అయిన తర్వాత... రైట్ సైడ్ టాప్‌లో అప్‌లోడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొదటి వీడియోని అప్‌లోడ్ చెయ్యండి. మీ వీడియోకి టైటిల్ ఇవ్వండి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చెయ్యండి. ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఏ వీడియో అయినా మీరు స్వయంగా తీసినదై, మీ సొంత వీడియో అయి ఉండాలి. మీ ఇంట్లో పిల్లల డాన్సులు, పాటలు పాడేవి, ఇంట్లో పిల్లులు, కుక్కలతో ఆడుకునేవి, చుట్టుపక్కల ఉండే పక్షులు, వంటలు, బొమ్మలు వెయ్యడం, టూరిస్ట్ ప్లేస్‌లు, సినిమాలపై రివ్యూలు ఇలా ఏవో ఒకటి మీరే స్వయంగా షూట్ చేసి... ఆ వీడియోలను మాత్రమే అప్ లోడ్ చెయ్యాలి. వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చెయ్యకూడదు.
3 మీరు పబ్లిష్ చేసిన వీడియోలు... మీ యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో మేనేజర్ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూ్బ్ మేనేజ్‌మెంట్ యాడ్స్ జతచేస్తుంది. తద్వారా యూడ్స్‌పై వచ్చే రెవెన్యూలో 60 శాతం మీకు ఇస్తుంది. ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉన్నాయి. (1) ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. (2) మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. ఈ రెండు కండీషన్లూ పూర్తవడానికి మీకు కనీసం 2 నెలల నుంచీ ఏడాది పడుతుంది. మీరు మంచి వీడియోలు పెడితే త్వరగా టార్గెట్ చేరుకుంటారు. వారానికి కనీసం 3 వీడియోలైనా పోస్ట్ చేస్తే మంచిది. మీరు టార్గెట్ చేరుకున్నదీ లేనిదీ అనలిటిక్స్ ఫోల్డర్ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు.
4 టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి... యూట్యూబ్ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా మీకు మనీ రావడం మొదలవుతుంది.
5 యూట్యూబ్ ద్వారా మీరు ఎంత సంపాదించిందీ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించదు. అది తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense) వెళ్లి చూసుకోవచ్చు.* యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే... గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచీ ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.
6 కోడ్ ఎంటర్ చేశాక... వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాల్ని యాడ్ సెన్స్ అడుగుతుంది. వాటిని కూడా యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.
7 బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాక... మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే... సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) పంపిస్తుంది గూగుల్. ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. ఇలా ప్రతిసారీ 100 డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్‌గా మనీ మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది.
ఈ మొత్తం ప్రాసెస్‌లో మీ యూట్యూబ్ ఛానెల్ పేరు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఇతర వివరాలు ఏవైనా, ఎప్పుడైనా మీరు మార్చుకునేందుకు వీలుంది. గూగుల్ వంద శాతం పక్కాగా పనిచేసే కంపెనీ. అందువల్ల పైన చెప్పిన యూట్యూబ్ రూల్స్ కూడా మీరు పక్కాగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఛానెల్ క్లోజ్ అవుతుంది.
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
డబ్బు సంపాదించాలంటే ఎలా, youtube money, youtube money per view, youtube earnings list, how to make money on youtube 2020, youtube monetization, how to earn money from youtube, youtube money calculator pewdiepie, youtube money-making, youtube income per 1,000 views
Tags
Business Ideas