లేపాక్షి ఆలయ రహస్యం మీకు తెలుసా | Wonders of Lepakshi Temple | Anantapur District

లేపాక్షి ఆలయం గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది.

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

108 శైవక్షేత్రాలలో ఒకటిగా చెప్పే లేపాక్షి ఆలయంలో ముందుగా వినాయకుడిని దర్శించి ఆ తరువాత వీరభద్రుడిని దర్శనం చేసుకుంటారు.
ఈ ఆలయంలో పానవట్టం మీద శ్రీరాముని ప్రతిష్టించబడి ఉంది. ఈ విచిత్రం ఒక్క ఈ ఆలయం లో తప్ప మరెక్కడా కూడా ఉండదు. ఇంకా వీరభద్రుడు, శ్రీరాముడు, దుర్గాదేవి, పాపనాశేశ్వరులను కలిపి ఆరాధించే ఏకైక ఆలయం కూడా ఇదే.

ఇక్కడ 30 అడుగుల ఎత్తు గల ఏడు తలల నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నట్లుగా మధ్యలో అద్భుత శివలింగం ఉంటుంది.
లేపాక్షికి కొంత దూరంలో 8.23 మీటర్ల పొడవూ, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపంలో అద్భుత నంది విగ్రహాం ఉండగా దేశంలోనే ఎత్తైన నంది విగ్రహం ఇదేనని చెబుతారు.
ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత అంతరిక్ష స్థంభం. దీనినే ఆకాశ స్థంభం అని కూడా అంటారు. ఈశాన్యమూలలో ఉన్నఈ అంతరిక్ష స్తంభం నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.

ఈ ఆలయంలో ఉన్న నాగలింగం వెనుక భాగంలో అసంపూర్తిగా ఉన్న పార్వతి పరమేశ్వరుల కల్యాణ మండపం ఉంది. ఇక్కడ ఉన్న శిల్పకళ చాతుర్యం అద్భుతం అనే చెప్పాలి.
సాధారణంగా ఆలయంలోని మండపంలో, స్థంభాలన్నీ కిందిభాగాన, పైభాగాన కూడా సమాన దూరంలో ఉండి, పై కప్పు బరువుని సమానంగా మోస్తుంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
ఈ ఆలయం విజయనగరం రాజుల కాలం నాటిదికాగా, కోశాధికారిగా పనిచేసే విరూపణ్ణ అనే అతడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.

ఖజానా అధికారైనా విరూపణ్ణ ఆలయాన్ని నిర్మిస్తూ రాజు ఖజానా వృధా చేస్తున్నాడని రాజు విరూపణ్ణ కళ్లని పొడిచివేయాలని ఆదేశించగా, మనస్థాపం చెందిన విరూపణ్ణ తన కళ్లని తానే పొడుచుకున్నాడు. అందుకే ఈ ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికి ఈ ఆలయంలో గోడపై ఎర్రటి రక్తం మరకలను చూడవచ్చు.
మన దేశంలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలు దేవతలు ఆతిధ్యం ఇచ్చే నివాసాలుగా చెబుతారు. అలాంటి అతికొద్ది ఆలయాలలో లేపాక్షి ఆలయం ఒకటిగా చెబుతారు.
ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ రామేశ్వరస్వామి శివలింగం, హనుమంతుడు ప్రతిష్టించిన హనుమ లింగం, స్వయంభువుగా వెలసిన పాపనాశేశ్వర లింగాలను దర్శనం చేసుకోవచ్చు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు.
Lepakshi Veerabhadra Swamy Temple

Lepakshi, Andhra Pradesh 515331

Related Temples :








   
లేపాక్షి ఆలయ రహస్యం , లేపాక్షి,  lepakshi temple miracles, lepakshi temple footprint, lepakshi temple hanging pillar wiki, lepakshi temple timings, lepakshi temple history in kannada, lepakshi nandi, hindupur to lepakshi, how to visit lepakshi temple, lepakshi painting, lepakthi temple history in telugu, lepakthi temple information.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS