33rd Question :
ప్రశ్న ) మనం అదరశమైన జీవితం గడపడం వల్ల మనకు మాత్రమే లాభామా ? ఈ సమాజానికి దాని ప్రయోజనం ఉంటుందా ? శివాజీ మొదలాగు మహావీరుల రామాయణ - భారతాల్లో పాత్రలను గురించి చిన్నప్పుడే విని ప్రభావితులైనారంటారు. నిజమేనా ? మహాపురుషుల జీవిత చరిత్ర లు చదివితే మనకు సమస్యలనేది మించి శక్తి కలుగుతుందా ?
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ‖ (3వ అ - 21వ శ్లో)
జవాబు : మనం ఆదర్శంగా జీవించడం వల్ల మనకు అభ్యుదయం కలగడమే కాకుండా, ఈ సమాజం మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడు ఉత్తమాదర్శలు కలవారిని అనుకరిస్తుంది. జీవినవిధానాలల్లో వారేర్పరిచిన ప్రమాణాలను అనుసరిస్తుంది. నిజమే! శివాజీ మొ || మహావీరులు చిన్నప్పుడే తల్లులు చెప్పిన రామాయణ - భారాతాల్లోని కథలు విని అందులోని నాయకులను చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకొని మంచి సంస్కృతిని మనకందించారు. అలాగే మహాపురుషుల జీవితచరిత్రలు చదివితే, వారు క్లిష్టసమయాల్లో నెలా ఎదురుకొన్నదీ! ఆ సందర్బాలాల్లో వారు వ్యవహరించిన తీరు, మనకు మార్గదర్శనం చేసి సమస్యలను ఎదుర్కొనే శక్తిని మనకవి కలిగిస్తాయి.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Tags
Bhagavad Gita Q&S