24th Question :
ప్రశ్న ) నాకావ్యక్తితో పరిచయం కలిగింది. అది అలా అలా పెరిగింది. ఆవ్యక్తిని గూర్చి ఆలోచించకుండా ఉండలేక పోతున్నాను. కొన్నాళ్లు గడిచాయి. ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే ఎంత బాగుండు, అనే కోరిక కలిగింది. ఆ వ్యక్తి పై ఇతరులకాభిమానమున్నట్లు తెలిస్తే చాలు ఒళ్లుమండేది. వాళ్లమీద ఎంతో ద్వేషం కలిగేది. నేనేదో పోగొట్టుకుంటున్నావనిపించేది. ఆ క్రోధంలో వెనుకటి స్నేహాన్ని మరచిపోయి ఎన్నో కానిమాటలు మాట్లాడను. ఏంచేయాలో తెలియడం లేదు. అసలు ఇదంతా ఎలా అనుభవించాలో ఆగమ్యగోచారంగా ఉంది. ఏమిటి కారణం ?
ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ‖ (2వ అ - 62వ శ్లో)
క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ‖ (2వ అ - 63వ శ్లో)
జవాబు : లోకంలో మనం ఏ వ్యక్తుల గురించి లేక ఏ వస్తువును గురించి ఎక్కువగా ఆలోచిస్తామో! పరిచయం పెంచుకుంటామో! వారి (టి) పైన మనకు సంగం కలుగుతుంది. సంగమంటే ఆసక్తి ఆ ఆసక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి. అవి కొన్ని నెరవేరతాయి.కొన్ని విఫలమౌతాయి. దానివల్ల ఇతరుల పై క్రోధం కలుగుతుంది. క్రోధం అజ్ఞానాన్నికి పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది. ఆవేశపరుడైననాడు తనను తాను మర్చిపోతాడు. మంచి చెడులు లేకుండా మాట్లాడి , చెడ్డ పనులు చేస్తాడు. ఇప్పుడు మి సమస్య స్వరూపం మికర్ధమైందనుకుంటాను. మీరు ముందే జాగ్రత పడి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు. వ్యక్తులతో గాని , వస్తువులతో గాని యోగ్యయోగ్యవిచక్షణ లేకుండా మీరు పరిచయం కలిగించు కోకూడదు. అలా కలిగించుకుంటే మిగతావి కూడా తప్పవు. సమస్యకు మూలాన్ని అర్దం చేసుకోండి. పరిష్కారం మీ చేతుల్లో ఉంటుంది.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Tags
Bhagavad Gita Q&S