Bhagavad Gita 4th Chapter 1-10 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 4వ అధ్యాయం

శ్రీమద్ భగవద్ గీత చతుర్థోఽధ్యాయః
అథ చతుర్థోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్ |
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ‖ 1 ‖


భావం : శ్రీ కృష్ణభగవానుడు : వినాశనంలేని ఈ 
యోగం పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు.

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ‖ 2 ‖
భావం : అర్జునా! ఇలా సంప్రదాయ పరపరంగా ఇచ్చిన కర్మయోగాన్ని రాజహర్షులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. 

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ‖ 3 ‖
భావం : నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం సుమా!
అర్జున ఉవాచ |
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ‖ 4 ‖

భావం : అర్జునుడు: సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో, మరి నీవు ఇప్పటివాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను.

శ్రీభగవానువాచ |
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ‖ 5 ‖
భావం : శ్రీ భగవానుడు : అర్జునా ! నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి వాటన్నిటినీ నేను ఎరుగుదును. నీవు మాత్రం ఎరుగవు.

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ‖ 6 ‖
భావం : జననామరణాలు లేని నేను సర్వ ప్రాణులకూ ప్రభువునప్పటికి నా పరమేశ్వరి స్వభావం విడిచిపెటకుండానే నేను మయాశక్తి వల్ల జన్మస్తున్నాను.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ‖ 7 ‖
భావం : ఈ లోకంలో ధర్మ అధోగతిపాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ‖ 8 ‖
భావం : సజ్జన సంరక్షణకూ, ధూర్జన సంహారనికి, ధర్మసంస్థాపనకూ నేను అన్ని యుగాలలో అవతరిస్తుంటాను.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ‖ 9 ‖
భావం : అర్జునా ! అలౌకికమైన నా అవతార రహస్యం యధార్ధంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు. నన్నే చేరుతాడు. 


వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ‖ 10 ‖
భావం : అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి, నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసినవాళ్ళు ఎంతో మంది తత్వజ్ఞానమనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు.










4వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 4th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning


1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS