Bhagavad Gita 2nd Chapter 1-12 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః
అథ ద్వితీయోఽధ్యాయః |
సంజయ ఉవాచ |

తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ‖ 1 ‖


>

శ్రీభగవానువాచ |
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ‖ 2 ‖
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ‖ 3 ‖
భావం : సంజయుడు ! దయామయుడు అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీ కృష్ణా పరమాత్మ ఇలా అన్నాడు.
అర్జున ! ఈ సంక్లిష్ట సమయంలో అర్యధర్మ విరుద్దమూ, అపకీర్తి దాయకమూ నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది ? నపుంసకుడిలా అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు. మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్ధడవు కదా! యుద్దం ప్రారంభించు.

అర్జున ఉవాచ |

కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ‖ 4 ‖
భావం : అర్జునుడు : మధుసూధన ! పూజర్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను ?


గురూనహత్వా హి మహానుభావాన్శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగానఽరుధిరప్రదిగ్ధాన్ ‖ 5 ‖
భావం : మహానుభావులైన గురువులను చంపడం శ్రేయాస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చమెత్తుకోవడం మేలు.

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ‖ 6 ‖
భావం : యుద్దం చేయడం మంచిదో కాదో తెలియడం లేదు. మనం జయిస్తామో వారు జాయిస్తారో చెప్పలేం. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్టరాష్ట్రాదులే ఎదురుగా వున్నారు.

కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ‖ 7 ‖
భావం : గురువులూ, బంధువులూ అనే మమకార దోషంవల్ల నా బుద్ది నశించింది. మంచి ఏదో తెలియడం లేదు. శిష్యుడిగా నన్ను ఆశ్రయించిన  నాకు ఏది శ్రేయమార్గమో దాన్ని ఆదేశించు.

న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ‖ 8 ‖
భావం : భూలోకధిపత్యం లభించిన , స్వర్గధిపత్యం సిద్ధించినా నా శోకం తగ్గుతుందనుకొకు.

సంజయ ఉవాచ |
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప |
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ‖ 9 ‖
భావం : సంజయుడు : అర్జునుడు శ్రీ కృష్ణుడితో అలా చెప్పి యుద్దం చేయనని ఊరుకున్నాడు.

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ‖ 10 ‖
భావం : రెండు సేనల మధ్య విషాదవశుడైవున్న అర్జనుణి చూసి శ్రీ కృష్ణా పరమాత్మడు పరిహాసంగా ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ |
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖ 11 ‖
భావం : అర్జున ! దుఃఖించ నవసరం లేని వాళ్ల కోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతున్నావు. చనిపోయినవాళ్ళ గురించి కానీ, బ్రతికున్న వాళ్ల గురించి కానీ వివేకులు శోకించారు.


న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ‖ 12 ‖
భావం : నీవు నేను వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్ లో కూడా వుంటాము.






2వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 


bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS