శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ‖ 31 ‖
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ‖ 32 ‖
భావం : పార్థా! అజ్ఞానాoధకారం వల్ల అధర్మాన్ని ధర్మాంగా, ప్రతి విషయాన్ని విరుద్దంగా, విపరీతంగా భావించే బుద్ధి తామస బుద్ధి.
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ‖ 33 ‖
భావం : పార్థా! మనసు, ప్రాణం, ఇంద్రియాలు-వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలదైర్యం సాత్త్విక ధైర్యం.
యయా తు ధర్మకామార్థాంధృత్యా ధారయతేఽర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ‖ 34 ‖
భావం : పార్థా! ధర్మార్థకామాల పట్ల అభిలాష, అభిమానం, ఫలభిలాష కలిగి వుండే ధైర్యం రాజసదైర్యం.
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ‖ 35 ‖
భావం : పార్థా! బుద్ధిలేనివాడు నిద్ర, భయం, విషాదం, మదం-వీటిని విడిచి పెట్టకుండా చేసే ధైర్యం తామస ధైర్యం.
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ‖ 36 ‖
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ‖ 37 ‖
భావం : భరత శ్రేష్ఠ! మానవుడికి అభ్యసించేకొద్ది ఆనందం, దుఃఖవినాశనం కలుగజేసే సుఖం మూడు విధాలు. దాన్ని గురించి తెలియజేస్తాను విను.
విషయేంద్రియసంయోగాద్యత్తదగ్రేఽమృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ‖ 38 ‖
భావం : మొదట అమృత తుల్యoగా వుండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు, ఇంద్రియాలు కలయిక వల్ల కలిగేది రాజ సుఖం అవుతుంది.
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ‖ 39 ‖
భావం : నిద్ర, బద్ధకం, ప్రమాదాల వల్ల జనించి, ఆదిలోనూ, అంతంలోనూ, మొహం కలుగజేసే సుఖాన్ని తామస సుఖం అంటారు.
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః ‖ 40 ‖
భావం : ప్రకృతి వల్ల కలిగిన ఈ మూడు గుణాలలో ముడిపడని వస్తువేది భూలోకంలో కాని, స్వర్గలోకంలో కానీ, దేవతలలో కాని లేదు.
18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి