శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |
అర్జున ఉవాచ |
సన్యాసస్య మహాబాహో! తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ‖ 1 ‖
శ్రీభగవానువాచ |
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ‖ 2 ‖
భావం : శ్రీ భగవానుడు : ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు .సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం.
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ‖ 3 ‖భావం : దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరికొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు.
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ‖ 4 ‖
భావం : అర్జునా! కర్మత్యాగ విషయంలో నా నిర్ణయం విను.త్యాగం మూడు విధాలు.
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ‖ 5 ‖
భావం : యజ్ఞం,దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచి పెట్టకూడదు. తప్పకుండా చేయాలి.
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ‖ 6 ‖
భావం : పార్థా ! అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా అసక్తినీ, ఫలాన్ని విడిచి పెట్టే ఆచలించాలని నిశ్చితమూ, ఉత్తమమూ అని నా అభిప్రాయం.
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ‖ 7 ‖భావం : స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు.అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామసత్యాగా మంటారు.
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ‖ 8 ‖
భావం : దుఃఖం కలగజేస్తాయనే భావనతో కానీ, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతోకని, నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజస త్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు.
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ‖ 9 ‖
భావం : అర్జునా! వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో అసక్తినీ , ఫలాన్ని విడిచి పెట్టి ఆచరించడమే సాత్త్విక త్యాగం.
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ‖ 10 ‖
భావం : సత్త్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించాడు శుభప్రదాలు, సులభసాధ్యాలు అయిన కర్మలను అభిమానించాడు.
18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here