Bhagavad Gita 12th Chapter 1-10 Slokas and Meaning in Telugu | భగవద్గీత 12వ అధ్యాయం 01-10 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత ద్వాదశోఽధ్యాయః
అథ ద్వాదశోఽధ్యాయః |

అర్జున ఉవాచ |
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ‖ 1 ‖

భావం : అర్జునుడు : ఇలా నిరంతరం మనస్సు నీమీదే నిలిపి నిన్ను భజించి భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తమమూలా ? 

శ్రీభగవానువాచ |
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః ‖ 2 ‖
భావం : శ్రీ భగవానుడు : నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్యనిష్టాతో, పరమశ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమయోగులని నా వుద్దేశ్యం. 

యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ‖ 3 ‖
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ‖ 4 ‖
భావం : ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ, నాశరహితమూ, అనిర్వచనియమూ, అవ్యక్తమూ, సర్వవ్యాప్తమూ, ఉహాతీతమూ, నిర్వికారమూ, నిశ్చలమూ, నిత్యమూ అయిన ఆత్మ స్వరూపాన్ని ఉపాసించేవాళ్లు నన్నే పొందుతారు. 

క్లేశోఽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ‖ 5 ‖
భావం : అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని ఆరాధించేవాళ్ల శ్రమ ఎంతో ఎక్కువ. ఎందువల్లనంటే శరీరం మీద అభిమానం కలవాళ్లకు అవ్యక్తబ్రహ్మం మీద నిష్ట కుదరడం కష్టసాధ్యం. 

యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ‖ 6 ‖
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామిన చిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ ‖ 7 ‖
భావం : పార్ధా! సమస్త కర్మలూ నాకే సమర్పించి, నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనస్సు నా మీదే నిలిపె వాళ్లను మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్దరిస్తాను.   

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ‖ 8 ‖
భావం : నా మీదే మనస్సునూ, బుద్దినీ నిలుపు. తరువాత తప్పకుండా నీవు నాయందే నివసిస్తావు.
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ ‖ 9 ‖
భావం : ధనుంజయా! అలా మనస్సు నా మీదే నిశ్చలంగా నీవు నిలపలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. 

అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి ‖ 10 ‖
భావం : అభ్యాసం చేయడంలోనూ అసమర్ధుడవైతే నా కోసం కర్మలు ఆచరించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడంవల్ల కూడా నీవు మోక్షం పొందగలుగుతావు.

12వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 12th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

4 Comments

  1. Aum Sri Sairam. Excellent, Great Services

    ReplyDelete
  2. చాలా గొప్ప యజ్ఞం ఇది.🙏🙏🙏🙏👌

    ReplyDelete
  3. Jai Sai Ram.. thank you Guruji

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS