Bhagavad Gita 11th Chapter 45-55 Slokas and Meaning in Telugu | భగవద్గీత 11వ అధ్యాయం45 -55 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత ఏకాదశోఽధ్యాయః
అథ ఏకాదశోఽధ్యాయః |

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస ‖ 45 ‖


భావం : దేవా! ఎప్పుడు చూడనీ ఈ విశ్వారూపాన్ని చూసి ఆనందించాను. అయితే  నా మనస్సు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవా! జగన్నివసా! దయ వుంచి నీ పూర్వ రూపాన్నే చూపించు, అనుగ్రహించు.

కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే ‖ 46 ‖
భావం : మునుపటిలాగే కిరీటం,గద,చక్రం ధరించి నిన్ను చూడదలిచాను. వేయి చేతులు కలిగిన విశ్వమూర్తీ! నాలుగు భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు. 

శ్రీభగవానువాచ |
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ‖ 47 ‖
భావం : శ్రీ భగవానుడు : అర్జునా! నీ మీద దయా తలచి నా యోగమహిమతో తేజోమాయమూ, సర్వోత్తమమూ, సనాతనమూ, అనంతమూ అయినా విశ్వరూపం నీకు చూపించాను. నీకు తప్ప ఎవడూ ఈ రూపాన్ని చూడలేదు.  

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః|
ఏవంరూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ‖ 48 ‖
భావం : కురువీరా! నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరు వేదాలు చదవడంవల్ల కాని, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోరతపస్సులు చేయడం వల్లకాని ఈ విశ్వ రూపాన్ని సందర్శించడం సాధ్యపడదు. 

మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ‖ 49 ‖
భావం : ఘోరమైన నా ఈ విశ్వరూపం చూసి భయపడకు, భ్రాంతి చెందకు, నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. 

సంజయ ఉవాచ |
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ‖ 50 ‖
భావం : సంజయుడు : అలా అర్జునుడితో చెప్పి శ్రీ కృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభితుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు. 

అర్జున ఉవాచ |
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ‖ 51 ‖
భావం : అర్జునుడు : జనార్ధనా! ప్రశాంతమైన నీ మానవరూపం చూశాక నా మనసు కుదుటపడింది. నాకు స్వస్థత ఏర్పడింది. 

శ్రీభగవానువాచ |
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ‖ 52 ‖
భావం : శ్రీ భగవానుడు : నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడడం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యమూ కోరుతుంటారు. 


నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ‖ 53 ‖
భావం : నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాలవల్లకాని, తపస్సులవల్లకాని, దానాదులవల్ల, యజ్ఞలవల్లకాని లభించదు.  

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ‖ 54 ‖
భావం : పరంతపా! విశ్వరుపుడైన నిన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడడానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది.  

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ ‖ 55 ‖
భావం : అర్జునా! నా కోసమే కర్మలు చేస్తూ, నన్నే పరమగతిగా భావించి, నామీదే భక్తి కలిగి, దేనిమీదా ఆసక్తి లేకుండా సమస్త ప్రాణులపట్ల శత్రుభావం లేనివాడు నన్ను పొందుతాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోఽధ్యాయః ‖ 11 ‖


11వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 11th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS