శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః
అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ‖ 33 ‖
భావం : అక్షరములలో "అ"కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అక్షయకాలము అనగా మహాకాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ‖ 34 ‖
భావం : అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా అనువారందరును నేనే.
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ‖ 35 ‖
భావం : గానము చేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను. ఛందస్సులో గాయత్రీఛందస్సును నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే.
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ‖ 36 ‖
భావం : వంచకులలో జూదమును నేనే. ప్రభావ శాలురలోని ప్రభావమును నేను. విజేతలలో విజయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే.
వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ‖ 37 ‖
భావం : వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే.
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ‖ 38 ‖
భావం: శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చగలవారి నీతిని నేనే. గోప్యవిషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానులయొక్క తత్వజ్ఞానమును నేనే.
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ‖ 39 ‖
భావం: ఓ అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచరప్రాణి ఏదియును లేదు.
నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ‖ 40 ‖
భావం : ఓ పరంతపా! నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని.
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంఽశసంభవమ్ ‖ 41 ‖
భావం: విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తు వేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ‖ 42 ‖
భావం: ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తు కేవలము నా యోగశక్తి యొక్క ఒక్కఅంశతోడనే ధరించుచున్నాను.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అథ దశమోఽధ్యాయః |

విభూతియోగో నామ దశమోఽధ్యాయః ‖ 10 ‖
10వ అధ్యాయం లోని 01-10 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం లోని 11-21 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం లోని 22-32 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం లోని 33-42 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం శ్లోకాలు మొత్తం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Bhagavad Gita Slokas with Audios in English Click Here