Bhagavad Gita 10th Chapter 22-32 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః
అథ దశమోఽధ్యాయః |

వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ‖ 22 ‖


భావం: వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో చైతన్యమును (ప్రాణశక్తిని) నేను.

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ‖ 23 ‖
భావం: నేను ఏకాదశరుద్రులలో శంకరుడను నేను. యక్ష రాక్షసులలో ధనాధిపతి యైన కుబేరుడను నేను. అష్ట వసువులలో అగ్నిని నేను. పర్వతములలో "సుమేరు" పర్వతమును నేను.

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ‖ 24 ‖

భావం : పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను.

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ‖ 25 ‖

భావం: మహర్షులతో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞములయందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను.

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ‖ 26 ‖

భావం: వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును). దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్దులలో నేను కపిల మునిని.

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ‖ 27 ‖

భావం: అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్ఛైఃశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ‖ 28 ‖

భావం: ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడి ఆవులలో కామధేనువును నేను. శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన  మన్మధుడను నేను. సర్పములలో వాసుకిని నేను.

అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ‖ 29 ‖
భావం: నాగజాతివారిలో ఆదిశేషుడను (అనంతుడను) నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను. పితరులతో అర్యముడను (పితృగణప్రభువును) నేను. శాసకులలో యమధర్మ రాజును నేను.

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ‖ 30
భావం: దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేను.


పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ‖ 31 ‖

భావం: పవిత్ర మొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను.

సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ‖ 32 ‖

భావం: ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను(సృష్టిస్థితిలయ కారకుడను నేనే). విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. పరస్పర వాద వివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు "వాదము"ను నేను.   

10వ అధ్యాయం లోని 01-10 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
10వ అధ్యాయం లోని 11-21 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS