ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా | Ashada Masam Special Importance Of Gorintaku

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? 
ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. పల్లెల్లో ఆడవారు అందరు ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్లయినవారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి, అంటు రోగాలు వ్యాపించడం పరిపాటీ. ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతవరణం చల్లబడుతుంది. కాని ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బైట వాతవరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆషాఢ మాసం వస్తే చాలు ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ  బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటిద్వారా క్రిములు వెళ్ళకుండా కాపాడుతుందని చెబుతుటాంరు. అంతే కాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది.

ఆడవారు గోరంటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జంట్స్, సర్ఫులను వాడటం వలన గోళ్ళలో నీరు చేరుతుంది. గోరంటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించ వచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తయిదవతనంతో వర్థిల్లుతారని విశ్వాసం.
ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం. శుభకార్యాలకు సెలవు. దీన్ని శూన్య మాసంగా పిలుస్తారు. ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభం అవుతాయి. కాబట్టి ఇది శూన్యమాసంగా చెపుతారు. ఈ ఆషాఢ మాసం నియమ నిష్ఠలకు ప్రత్యేకమైన మాసం. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు. కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింప చేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. ఏవైనా మానని గాయలకు కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు. ప్రస్తుత కాలంలో వచ్చే   కోన్‌లు, నేల్‌ పాలీషులు పనికిరావు.
పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తున్నారు. కాని ప్రతీ దాంట్లో కూడా ఒక సింటిఫిక్ రీజన్‌ మనకు కనిపిస్తుంది. ఆలోచిస్తే..

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

ఈ మాసంలో దీక్షలు, వ్రతాలు ఆచరణ చేయడం. కామితార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాలకోసం ప్రయత్నం చేసే మాసం. శరీరాన్ని మనస్సును ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢమాసం. కాబట్టే ఈ మాసంలో బోనాలు, జాతరలు మొదలైనవి, వేప ఆకులు, పసుపు పెట్టుకోవడాలు, వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిని అందరూ ఆచరింటాచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..

Interesting Temples:
పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు




ఆషాఢం, గోరింటా, ఆషాడం, Ashada Masam Special , Ashada Masam, Significance Of Gorintaku,  Ashada Masam gorintaku

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS