శ్రీ మూకాంబికా అమ్మవారి దేవాలయం, కొల్లూరు, కర్ణాటక :
కర్ణాటకలోని ఏడు ముక్తి స్థల యాత్రిక స్థలలైన కొల్లూరు , ఉడిపి, సుబ్రమణ్య, కుంబాషీ, కోటేశ్వర , శంకరనారాయణ మరియు గోకర్ణలలో మూకాంబిక దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని శ్రీ మూకాంబిక దేవి విగ్రహాన్ని స్వయంగా ఆదిశంకరాచార్య స్వామి వారు ప్రతిష్టించారు. మూకాంబిక దేవిని శక్తి , సరస్వతి మరియు మహాలక్ష్మి స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ ఆలయం పూర్తిగా చక్కటి శిల్పకళలతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలో జ్యోతిర్మయి లింగం ఉంటుంది. ఈ లింగం మూకాంబిక విగ్రహాన్నికి ముందు ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే మూకాంబిక అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసే ఉన్నత చదువులు చదువుతారని , తెలివిగల వారై జ్ఞాన సంపన్నులు అవుతారని భక్తుల నమ్మకం.ఆలయ చరిత్ర :
ఈ ఆలయం కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడం తన తపస్సు కి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమవ్వడం తన జన్మ స్థలమైన కేరళకు రమ్మని అడగడం దేవి ఆ కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట నడవడం కానీ వెనక్కి తిరిగి చూడవద్దని అలా చూస్తే చూసిన ఆ స్థలంలోనే స్థిరంగా ఉండిపోతాను అని అమ్మావారు చెప్పడం ఆ షరతుకు అంగీకరించి శంకరాచార్య ముందుకు నడుస్తూ వెనుక అమ్మవారు వెళ్తూ వెళ్తూ కొల్లూరు ప్రాంతాన్నికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో వెనుకకు తిరిగి చూడడం ఇచ్చిన మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరుల వారు శ్రీ చక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి.కొల్లూరు లోని మూకాంబిక దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు 135 కి.మీ దూరంలో ఉన్నది. మూకాంబిక దేవి ఆలయన్ని ఆది మహాలక్ష్మి దేవి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలో పంచముఖ గణపతి , శ్రీ సుబ్రమణ్య స్వామి , ఫారడేశ్వర , శ్రీ ఆంజనేయ , ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో స్వచ్చమైన తేనె , మొదలైన పదార్ధాలతో తయారు చేయబడిన పంచ కడ్జయం అనే ప్రసాదాన్ని నైవేద్యం గా పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత ఆలయంలో ఉన్న బావిలో వేసేవారట. ఇదంతా చూసి చదువు రాని ఒక కేరళ నివాసి , ఆ ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కొని తిన్నాడట. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని తిన్నడం వల్ల అతడు మహా పండితుడు అయ్యాడు అని అంటారు.
అందువల్లనే కేరళ ప్రజాలల్లో అమ్మవారి పై అపార నమ్మకం. ప్రతి రోజు అమ్మవారి ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రి మంటపంలో పిల్లలకు వారి మాతృభాషలో అక్షరాలు నేర్పించడం జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 6.00AM TO 2.00PMసాయంత్రం : 5.00PM TO 8.30PM
ఆలయ చిరునామా :
శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయం ,కుండాపురా తాలూకా,
ఉడిపి జిల్లా,
కొల్లూరు పట్టణ ప్రాంతం,
కర్ణాటక రాష్ట్రం - 576220
భారతదేశం.
Ph : +91 8254258221
Website : https://www.kollurmookambika.org/
ఆలయానికి చేరుకునే విధానం :
ఈ ఆలయాన్నికి చేరుకోవడానికి రోడ్డు , రైలు , విమాన మార్గాలు ఉన్నాయి.బస్ మార్గం :
ఈ ఆలయం దేశం లోని అన్నీ మార్గాల నుంచి మొదటకొల్లూరు బస్ స్టాండ్ కి సరాసరి బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి ఈ ఆలయాన్నికి చేరుకోవచ్చు.రైలు మార్గం :
రైలు మార్గం ద్వారా చేరుకోవాలి అంటే బిజూర్ మరియు కొల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ కలదు. కొల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి 20 కి.మీ దూరంలో కలదు.విమాన మార్గం :
హుబ్లి మరియు బజ్ పే విమానశ్రయలు దగ్గరలోని విమానశ్రయాలుహుబ్లి నుంచి 170 కి. మీ దూరంలో కలదు.
KeyWords : Sri Mookambika Temple , Kollur , karnataka Surrounding Temples, Hindu Temples Guide