శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం, అలంపూర్ :
అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవశక్తిపీఠం శ్రీ జోగులాంబ శక్తి పీఠం.ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ లో అగ్నేయ దిశగా ఉంది. కాశీ నగరానికి వరణ, అసి అనే నదులు అటు , ఇటు ఉన్నట్లే , అమాపురనికి అటు , ఇటు వేదవతి , నాగావళి నదులు ఉన్నాయి. అందుచే ఈ నగరాన్ని దక్షిణా కాశీ అని కూడా అంటారు. పూర్వం ఈ ఆలయం శిధిలమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించి , జీవగుళాంబ దేవి విగ్రహం , చండీ , ముండి విగ్రహాలను ఈ ఆలయంలో ప్రతిష్టించారు.ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత :
ఇక్కడ అమ్మవారి దవడ పంటితో పడిన స్థలం. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నట్లు కనపడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో చక్కటి కోనేరు ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఈ ప్రాంతానికి పూర్వం హేమాలపురం అనే పేరు కలదు. ఈ ఆలయంలో విచిత్రంగా అమ్మవారి శిరస్సు పైన బల్లి , గుడ్లగూబ , తేలు , కాపాళం దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారి శక్తిని సామాన్య భక్తులు దర్శించలేరు అని భావించిన శ్రీ ఆది శంకరులు శ్రీ చక్రాన్ని ప్రతిష్టాపన చేశారు.ఈశ్వరుడు బ్రహ్మతో కలసి ఇక్కడ బాల బ్రహేశ్వరుడు గా పూజలు అందుకుంటున్నారు. ఆలయ శాసనాల ప్రకారం పూర్వం ఒక ముని శాపం వలన బ్రహ్మ తన బ్రహ్మత్వం కోల్పోయి ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివుని ప్రత్యక్షయం అయే విధంగా ఘోరమైన తపస్సు నిర్వహిస్తాడు. ఆ మహా దేవుడు ప్రత్యక్షయం కావడం వల్ల తాను ఈ బ్రహ్మ పేరు మీదనే కొలువై ఉంటాను అని మాట ఇచ్చి అప్పటి నుంచి ఈ ప్రాంతం లో బాల బ్రహేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు.
ప్రధాన ఆలయంలో స్వామి వారు లింగ రూపంలో కాకుండా గో పాద ముద్ర రూపంలో దర్శనం ఇస్తారు. అనగా శివుడు కైలాసం వదిలి ఇక్కడికి రావడం పార్వతి మరియు నందికి ఇష్టం ఉండదు. కావున స్వామి వారిని ఎలాగైనా ఆపాలి అని నంది స్వామి వారు పాదం పేడుతున్న సమయంలో నంది తన గో పాదాన్ని పెడుతున్నది. కానీ పరమేశ్వరుడు భక్తునికి ఇచ్చేన మాటతో ఆ నంది పైనే కాలు మోపి గో పాద ముద్ర గా దర్శనం ఇస్తారు.
ఇక్కడ అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం నగార శిల్ప కళాతో నిర్మితమై ఉంటుంది. ఈ ఆలయం క్రీ. శ 642 లో రెండవ పులకేశి నిర్మించినట్టు తెలుస్తుంది. 13 వ శతాబ్దంలో అప్పటి సుల్తానుల కాలంలో ఈ ఆలయం పై దాడి జరిగినది. ఇక్కడ కొలువై ఉన్న ఉప లింగ ఆలయాలు ఒక్కో ఔషదగుణం కలిగిన లింగం గా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో మరి యొక్క విశేషం కూడా ఉన్నది మనకు ఎక్కడ కనిపించని విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు దర్శనం ఇస్తాయి.
చూడాలసిన ప్రదేశాలు :
ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన అందమైన విగ్రహాలు ఉన్నాయి. నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఆలంపూర్ దగ్గరలో 20కి పై బడిన శివాలయాలు ఉన్నాయి. ఇందులో పాపనాకేశ్వర దేవాలయం. ఆలయ ప్రాంగణం అంతా ఎర్రని స్తంభాలతో ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకొంటారు.ఈ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొంటే మహాపుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో అమ్మావారి వెంట్రుకలు పైకి ఉంటాయి. దీనినే జటా అంటారు. మిగిలిన ఏ అమ్మవార్ల కు జత వెనుకభాగంలోనే ఉంటుంది.
ఆలయ ప్రాంగణంలోనే సెమీ వృక్షం ఉంది. పక్కనే నవగ్రహలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ సమీపంలోనే కామాక్షి దేవి ఆలయం ఉంది. పక్కనే రేణుకా అమ్మవారు కొలువై ఉన్నారు. జోగుళాంబ దేవి ప్రధాన ద్వారం గుండా ఉండే రెండవ మండపంలో త్రిమూర్తులు కాలభైరవుడు , నవగ్రహాలు , ఇక్కకద దర్శనమిస్తాయి
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 5.00-12.00సాయంత్రం : 4.00-8.00
ఆలయ చిరునామా :
శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం ,అలంపూర్ (గ్రామం ),
మహబూబ్ నగర్ (జిల్లా ),
తెలంగాణా రాష్ట్రం.
Phone : 08502241327
KeyWords : Sri Jogulamba Temple, Jogulamba Temple Detaisls, 5th Saktipeetham, Alampur , Mahabubnagar Dist , App, T.S.District Wise , Hidnu Temples Guide.
Tags
18 Shakti Peethas
Famous Temples
Jogulamba Gadwal district
Mahabubnagar District wise
Telangana