సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
ఈ సంగారెడ్డి నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు మెదక్ అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.1. కేతకీ సంగమేశ్వర దేవాలయం , ఝరాసంగం :
ఈ ఆలయాన్ని దక్షిణ కాశి అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలోని వనమును కేతకి వనము అని, ఇచట శౌనకాది మునులు యజ్ఞం చేసినట్లు పురాణాల ద్వార తెలుస్తుంది. మహాశివరాత్రి సందర్బంగా ఇచట ప్రతి సం || ఉత్సవాలు జరుగుతాయి.జహీరాబాద్ పట్టణం నుండి 16 కి.మీ దూరం లో ఉంది. ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇప్పుడు శిధిలావస్తా కి చేరుకున్నది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.30PM.
2. సిద్ది వినాయక గుడి , రేజింతల్ :
ఈ ఆలయం శ్రీ వినాయక ఆలయాలలో తెలంగాణలో మొదటి ఆలయం. ఈ ఆలయం రేజింతల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 200 సం || చరిత్ర కలదు. ఈ సిద్ధివినాయకుడు ఏటేటా పెరుగుతూంటాడని భక్తుల నమ్మకం. ముందు రెండున్నర అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తూ, ఆరడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు అంటారు. ప్రతి సం || వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 3.30PM TO 7.00PM.
3. శ్రీ త్రికూటేశ్వరాలయం , కల్పగూర్ :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని కాకతీయ రాజుల కాలం లో నిర్మించరు. ఈ ఆలయం 11-13 శాతబ్దంలో నిర్మించింది. సంగారెడ్డి పట్టణానికి 4 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం త్రికూట పద్దతిలో నిర్మింపబడింది. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 8.00AM TO 12.00PM - 3.00PM TO 7.30PM.
4. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం, భీరంగూడ :
ఈ ఆలయానికి రెండవ శ్రీశైలంగా పేరుగాంచిది ఈ ఆలయం. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 13 వ శతాబ్దంలో వేలిసిందని చారిత్రక ఆధారం. పటాన్చెరు మండలం లో ని అమీన్ పూర్ పరిధిలో బీరంగూడ గుట్ట ఫై ఈ దేవాలయం ఉన్నది. శివరాత్రి సందర్బంగా ఇక్కడ 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
5. రామలింగేశ్వర ఆలయం , నందికంది :
అతి పురాతన శైవ క్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 11వ శతాబ్దం లో చాళుక్యులు నిర్మించిన కళాత్మక కట్టాడం, స్థంబాల పైన చెక్కడాలు, గుడిలో ఉన్న కళాత్మాక రూపాలు చుస్తే ఎంతో అద్బుతంగా ఉంటాయిగర్బాలయం లో రామలింగేశ్వర స్వామి కొలువు తిరి ఉన్నాడు ,గుడి ఆవరణ లో అప్సర లు, దిక్పాలకులు విగ్రహాలు కూడా ఉంటాయి . ఆలయం లో మర ప్రత్యేకత ఏంటి అంటే అదుతమైన నంది విగ్రహం ఉంటుంది దేవాలయం లో ఉన్న స్థంబాల పైన రక రకాల దేవత మూర్తుల విగ్రహాలు కొలువై ఉన్నయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
6. వీరభద్రస్వామి ఆలయం , బొంతపల్లి :
మహా శివుని మారియొక్క రూపమే ఈ వీరభద్ర స్వామి. ఈ ఆలయం హైదరాబాద్ మెదక్ రోడ్డు ఫై వీరభద్రస్వామి భద్రకాళి సమేతుడై ముక ద్వారం ఫై భక్తులను ఆశిర్వదిన్చుచున్నాడు. వీరశైవ కాలం లో ఈ దేవాలయం కట్టబడినది.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
సంగారెడ్డి జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise
KeyWords : Sangareddy Famous Temples List, Sangareddy District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide