మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలజాబితా :
1. శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం , అల్లం పూర్ :
అష్టాదశ శక్తి పీఠలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం పూర్తిగా ఎర్ర రాయి తో నిర్మించారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి గా ఉండడం గమనించవచ్చు. వసతి సౌకర్యాలు తక్కువ. అమ్మవారి ఆలయం పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
2 శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం , ఉమా మహేశ్వరం :
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ ఆలయం కలదు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో 100 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం ప్రకృతి రమణీయల మధ్య చాలా బాగా ఉంటుంది. ఈ ఆలయం రంగాపురం అనే గ్రామనికి 4 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో స్వామి అమ్మవారు ఉమామహేశ్వర స్వామి గా కొలువై ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
3. శ్రీ శివాలయం , సలేశ్వరం :
ఈ ఆలయం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కలదు. మున్నర్ ప్రాంతానికి 35 కి. మీ దూరంలో కలదు. శ్రీశైలం నుంచి వచ్చే దారిలో 65 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం శివరాత్రి నుంచి 4 రోజుల ముందు నుంచి మాత్రమే. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే ఎంతో మనోధైర్యం కూడా ఉండాలి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM - 5.30PM.
4 శ్రీ మైసమ్మ ఆలయం , మైసిగండి :
ఈ ఆలయంలో అమ్మవారు మైసమ్మగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో విశేషం అమ్మవారు 20 అడుగుల ఎత్తులో పుర్రెల మాల ధరించి ఉంటుంది. ప్రతి ఆదివారం మరియు మంగళ వారం లలో బోనాల ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. నూతన వాహనాల పూజలు కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.30PM - 1.00PM TO 7.00PM.
5. శ్రీ చెన్నకేశవా ఆలయం , గద్వాల్ :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం గంగాపూర్ , జడ్చర్ల (మ) లో కలదు. శివ స్వామి యే చెన్నకేశవా గా పూజలు అందుకుంటున్నారు. శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
6. శ్రీ అగస్త్య స్వామి ఆలయం , జీఠళ్ళూరు :
కొల్హాపూర్ నుంచి ఈ ఆలయానికి 11 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం 16 వ శతాబ్దం కి చెందినది. శివరాత్రి , కార్తీక మాస శివరాత్రి , తొలి ఏకాదశి వాటి పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 1.00PM - 3.00PM TO 8.30PM.
7. శ్రీ మహాలక్ష్మి , వేంకటేశ్వర స్వామి ఆలయం , కొండగల్ :
ఈ ఆలయం కొండగల్ అనే గ్రామం లో కలదు. ఈ ఆలయాన్ని 1970 నిర్మించారు. ఈ అలయని రెండవ తిరుపతి గా కూడ పిలుస్తారు. ఉగాదికి 4 రోజుల ముందే ఇక్కడ స్వామి అమ్మవార్లకి బ్రమోస్తావాలు ప్రారంభం అవుతాయి. ప్రతి శుక్ర , శనివారం లలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
8. శ్రీ రంగనాయక స్వామి ఆలయం , శ్రీ రంగాపూర్ :
ఈ ఆలయం శ్రీ రంగాపూర్ అనే గ్రామం , పిబరర్ (మ) లో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 18 వ శతాబ్దానికి చెందినది. విజయనగర శిల్పశైలి లో ఈ ఆలయం ఉంటుంది. శ్రీ రామనవమి ఉత్సవాలు వైభవంగా చేస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise List
KeyWords : Mahabubnagar Famous Temples List, Mahabubnagar District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide