హర్యాణా వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన మరియు దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున యమునా నది హర్యాణా మరియు ఉత్తరాఖండ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. 4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక మరియు హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే శ్రీకృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయమున గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్ మరియు పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి.
హర్యాణా ప్రసిద్ధ దేవాలయాలు
కురుక్షేత్ర - బ్రహ్మ సరోవరం
కురుక్షేత్ర - కురుక్షేత్రము
ధానేశ్వర్ - త్రిశూల సమేత శివలింగం
జింద్ - జ్వాలామలేశ్వరీదేవి ఆలయం
జింద్ - భూతేశ్వర ఆలయం
సైనిక్ కాలనీ - శివాలయం
మానిమాజ - మనసాదేవి ఆలయం
అంబాలా అంబాదేవి మందిరం
గుర్ గావ్ - శీతలాదేవి మందిరం
కైతాల్ - దేవి మందిరాలు