Arulmigu Subramanya Swami Kovil, Tiruttani | తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి


సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరుపడైవీడు క్షేత్రాలలో తిరుత్తణి మూడవది.  తమిళనాడు గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం లో తమిళనాడు లో ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు కలిగి ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడతారు. ఈ క్షేత్రం లో నడిచి వెళ్లే భక్తులు మెట్లపైన తెలుగు వారి పేర్లు ఉండటం గమనించవచ్చు. ఆరుపడైవీడు క్షేత్రాలలో 5 క్షేత్రాలు కొండపైన ఉంటే తిరుచెందూర్ క్షేత్రం మాత్రమే సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఈ క్షేత్రం కొండపైన ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కొండను చేరడానికి మొత్తం 365 మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు ఒక్కో రోజుకు సమానం అని చెబుతారు. 
 ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.
క్రీ.శ.875-893 లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీ.శ.907-953 లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.  ఈ క్షేత్రాన్ని త్రేతా యుగం లో శ్రీ రామచంద్రమూర్తి ద్వాపర యుగం లో అర్జునుడు దర్శించినట్టు కథనం . 


తిరుత్తణి క్షేత్రం చేరడానికి తిరుపతి , కాంచీపురం నుంచి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి.  తిరుపతి నుంచి 70 కిమీ దూరం ఉంటుంది. తిరుత్తణి లో రైల్వే స్టేషన్ ఉంది. బెంగళూరు వాళ్ళు అరక్కోణం వరకు ట్రైన్ లో వచ్చి అక్కడనుంచి తిరుత్తణి వెళ్ళవచ్చు . అరక్కోణం నుంచి తిరుత్తణి 13 కిమీ. అరక్కోణం నుంచి కాంచీపురం 29 కిమీ దూరం. 

ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి : 
1 . పళని 
2. తిరుత్తణి
3. స్వామిమలై
4. పళముదిర్చోళై 
5. తిరుప్పరంకుండ్రం

6. తిరుచెందూర్

తిరుత్తణి దేవాలయం వెబ్సైటు :  http://www.tirutanigaimurugan.tnhrce.in/
దేవాలయం తెరుచుఉండు సమయాలు : 5.45 am to 12.30 pm , 4:00 to 8.45 pm

పూజలు
Vishvaruba Dharsanam : 06.00 AM
Kala Sandhi Pooja : 08:00 AM
Uchala kala Pooja : 12:00 NOON
Sayaratchai Pooja : 05:00 PM
Arthajama Pooja : 08:00 PM
Palliarai Pooja : 08:45 PM
Kala Sandhi Pooja : Sunday and Tuesday at 05:00 A.M
Phone (Hill Temple) : 044 - 27885243

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS