కొండపాటూరు ‘పోలేరమ్మ’ అమ్మవారు
కొండపాటూరు... గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని చిన్న గ్రామం. కానీ... అక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారు చాలా...చాలా... శక్తివంతమైన....మహిమాన్వితమైన... సత్యంగల... గ్రామదేవత... కొండపాటూరు పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళను (లేదా) అమ్మవారికి భక్తులు సమర్పించే బోనాలు ‘కొండపాటూరు జాతర’గా ప్రసిద్ధి. పూర్వం అమ్మవారు గ్రామంలోని ప్రజలకు రాబోయే అరిష్టాలను గురించి ముందే హెచ్చరిస్తుందని అంటుంటారు. అమ్మవారు పెద్దగా వేసే అరుపులకు జనం భయపడి పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేశారని చెబుతుంటారు.
గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళే రోడ్డు (ఎన్‌హెచ్`5) వైపు పర్చూరు రోడ్డు వైపు ప్రత్తిపాడు, పెదనందిపాడు మీదుగా వెళ్ళవలెను. గుంటూరు నుండి కొండపాటూరు సుమారు 45 కి.మీ. వుంటుంది.
చుట్టు ప్రక్కల రైతులు తమ పాడిపంటలు పచ్చగా వుండాలని అమ్మవారిని కోరుతుంటారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద కుటుంబాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ ట్రాక్టర్లను, ఎడ్లబండ్లను మల్లెపూలతో అలంకరించడం చూస్తే ముచ్చటేస్తుంది.
భక్తులు వారి వారి స్తోమతను బట్టి ప్రభలను గొప్ప ఊరేగింపుతో భజాభజంత్రీలతో, తప్పెట్లతో తమ తమ బండ్లపై కట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
ఇక్కడ వున్న మరొక ముఖ్యమైన విషయం. ‘‘సిడిమాను’’. జాతర రోజు ఈ సిడిమానుకు కట్టబడిన బోనులో మేకపిల్లను వుంచి గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు. భక్తులు జీడిమామిడి కాయలను ఈ మేకపిల్ల వున్న బోనుపైకి విసరివేస్తారు. అవి తిరిగి మనకు అందితే మన మనస్సులో వున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సిడిమానుకు రైతులు తమ తమ పొలాల్లో పండిన పంటలతో అలంకరిస్తారు. ఈ తిరునాళ్ళకు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో విచ్ఛేస్తారు. ఇటు వైపు వచ్చినప్పుడు అమ్మవారిని తప్పక దర్శించండి...
Kondapaturu Village is Located in Kakumanu Mandal District of Guntur State of Andhrapradesh.
How to Reach Kondapaturu:
45 km From Guntur, Buses are available from guntur.
Kondapaturu Poleramma Temple Address:
Kondapaturu Village,
Kakumanu Mandal,
Guntur District ,
Andhra Pradesh.
Credits: Ravikiran Damarla
Kondapaturu Village, Poleramma Temple, Famous Temples in Guntur District, Temple Information in Telugu, Guntur Kondapaturu Poleramma temple information in telugu, hindu temples guide