Sri Kumararama Bhimeswara Temple Entrance, Samarlakota, East Godavari.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడి శివలింగం 14 అడుగులు ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే ద్రాక్షారామ క్షేత్రాన్ని నిర్మించినది. అందుకే ఈ రెండు దేవాలయాలు ఒకే నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి .కుమార భీమేశ్వరస్వామి ఆలయ నిర్మాణం క్రీ.శ. 892-922 మధ్య జరిగింది. ఇక్కడి శివలింగం సున్నపు రాయితో చేయబడి తెల్లటి రంగులో ఉంటుంది.ఈ ఆలయం అంత చక్కటి శిల్ప కళను కలిగి ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైన అమ్మవారు బాలత్రిపురసుందరిదేవి. కాలభైరవ రూపంలో కూడా శివుడు ఇక్కడ ఉన్నాడు. గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల శివలింగం నిర్మాణ సమయంలో అంతకంతకు పెరిగిపోవడం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కధ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. స్వామి వారికీ ఎదురుగ ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు. దేవాలయం లోపలి ప్రాంగణంలో వినాయకుడు,కాలభైరవుడు,వీరభద్రుడు,మహాకాళి,శనేశ్వరుడు,నవగ్రహాలు కొలువుదీరి కనిపిస్తాయి. భీమేశ్వరస్వామి ఆలయం దగ్గరలోనే మాండవ నారాయణ స్వామి ఆలయం ఉంది. మహాశివ రాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
దగ్గరలో చూడవల్సిన ఆలయాలు:
సామర్లకోటకి 8 కి.మీటర్ల దూరంలో పిఠాపురం నందు పాదగయక్షేత్రం ఉంది. సామర్లకోటకి 12 కి.మీ దూరంలో దివిలికి దగ్గరలో తొలితిరుపతి ఉంది.పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి గుడి సామర్లకోటకి 8 కి.మీటర్ల దూరంలో ఉంటుంది.
Sri Kumararama Bhimeswara Swamy Temple is located in Samarlakota District of East Godavari State of Andhrapradesh. It's one of the pancharamakshetras in andhrapradesh.
Bhimeswara Temple , Samarlakota
15 From Kakinda
Sri Mandavyanarayanaswamy Temple , Samarlakota
Temple Darshan Timings :
Morning : 5.30 am to 12.30 pm
Evening : 4 pm to 8.30 pm
Near By Temples Guide :
1.Pithapuram Padagaya ( 8 km )
2. Toli Tirupathi ( 12 km away from Samarlakota, 2 km away from Divili)
3. Peddapuram Maridamma Talli Temple ( 8 km From Samarlakota)
1. Draksharamam ( Draksharamam , East Godavari)
sri kuramarama bheemeswara swamy temple information, samarlakota temples list, best temples information in hindu temples guide, Temples timings, Samarlakota Bheemeswara Temple History, Hindu temples guide.com