SRI EKAMBARESWARER TEMPLE KANCHIPURAM Tamil Nadu | Kanchipuram tour details in telugu

SRI EKAMBARANADHAR TEMPLE HISTORY


కాంచీపురం లో పంచభూత లింగాల్లో ఒకటైన పృద్వి లింగం ఏకాంబరనాథర్ ఆలయం లో ఉంది. ఈ ఆలయ గోపురం ఎత్తు 190 అడుగులు,  ఈ ఆలయం లోనే మామిడి చెట్టు క్రింద పార్వతి దేవి ఇసుక తో శివలింగం చేసి తపస్సు చేస్తుండగా పరీక్షించదలచిన శివుడు ఎక్కువ కంప నదిని పొందేటట్టు చేస్తాడు, ఇసుక లింగం కొట్టుకుని పోకుండా అమ్మవారు లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది.

శివుడు పార్వతి దేవి తపస్సుకు సంతోషించడం తరువాత అరుణాచలం లో అర్ధనాధీశ్వరులుగా ఏకమయ్యారని స్థలపురాణం. 
ఈ ఆలయం చాల పెద్దది. లోపల పెద్ద కోనేరు ఉంటుంది. మనం గాలిగోపురం దాటి లోపాలకి వెళ్ళినప్పుడు మనకి పెద్ద మండపం కనిపిస్తుంది. మండపం బయట లోపల కూడా నందీశ్వరులును చూడవచ్చు. 
మనం లోపలికి  ప్రవేస్తున్నప్పుడు ప్రధాన ద్వారం కుడివైపు అద్దం  లో పార్వతి దేవి తపస్సు చేసిన మామిడి చెట్టు కాండం ఉంచారు. ఈ మామిడి చెట్టు 3500 సంవత్సరాల క్రింతం నాటిదని అక్కడ ఉంచిన బోర్డు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అదే స్థానం లో వేరే మామిడి మొక్కను నాటారు. ఇంతక ముందున్న మామిడి మొక్కకు నాలుగు కొమ్మలకు నాలుగు రకాలైన మామిడిపళ్ళు కాసేవాని చెప్తారు. అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం స్వామి వారి దర్శనం అయినతరువాత వెనుక వైపుకి వెళ్లి చూడాలి. 
మనం వెనకవైపుకి నడుస్తుంటే కుడివైపున 1000 లింగాలు మనకు కనిపిస్తాయి. ఓం నమః శివాయ ఓం నమ శివాయ అంటూ మనం నడుస్తుంటే శరీరం లో వచ్చే ప్రకంపనలు మనకు స్పష్ఠంగా తెలుస్తాయి. మరో ముఖ్యమైన శివలింగం మరొకటుంది. మామిడి మొక్క ఉన్న చోటు నుంచి కుడివైపు... మనం నడుచుకుంటూ వస్తున్నాం కదా ఈ లింగం కుడివేపు ఎత్తు లో ఉంటుంది . ఇక్కడ అద్దాలు మండపం ఉంటుంది. లింగం పైన చాల శక్తివంతమైన రుద్రాక్షలు లింగం పైన ఉంటాయి. ఏకామ్రేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్ధం. గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే 12 గంటల లోపు  మీరు ఉండేలా చూస్కోండి. 4 గంటలకు ఆలయం తెరుస్తారు. లోపాలకి 12- 4 మధ్యలో ఎవరిని వెళ్లనివ్వరు. 5 టికెట్ తో ప్రత్యేక దర్శనమ్ ఉంటుంది. మీరు ఆ టికెట్ తీసుకుంటే మీరు కాస్త దగ్గర నుంచి స్వామి వారిని చూడవచ్చు. పూజలు చేయించదలచిన వారు పూజారులకు నేరుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
దర్శనం అయినతరువాత మీరు బయటకు వచ్చి . ( మెయిన్ రోడ్ మీదకు ) , పెట్రోల్ బంక్ పక్కనే శ్రీ చంద్ర శేఖరేంద్ర స్వామి వారి చిత్రపటాలను స్వామి వారి విగ్రహాన్ని చాల అద్భుతంగా ఉంచారు. మీరు తప్పక చూడాలి.. ప్రవేశం ఉచితం. ప్రక్కనే కంచి మఠం వారి సత్రం ఉంటుంది. 12.30 లోపు మీరు అక్కడ ఉండాలి. 

Temple Timings :
Morning : 6 am to 12 pm 
Evening : 4 pm to 8 pm
panchabuta stalam, panchabhuta stahalam, prudvi lingam, earth lingam, kanchipuram temples, ekambareswarer temple timings, temple history in telugu, ekambareswarer temple history in telugu pdf file,famous temples in  kanchipuram. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS